జక్రాన్‌పల్లి: పాడి పశువులు రోగాల బారిన పడకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి గా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అఽధికారి బస్వారెడ్డి పశుపోషకులకు సూచించారు. మండలంలోని సికింద్రాపూర్‌లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మంగళవారం పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువులు, ఆవులు, గేదెలు, ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలంటే టీకాలు వేయించాలన్నారు. ఆరు నెలలకోసారి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వే యించాలన్నారు. సర్పంచ్ అప్పాల అరుణ్‌కుమార్, మండల పశువైద్యాధికారిణి అశ్రితరెడ్డి, జంతు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏడీ డాక్టర్ కిరణ్ దేశ్‌పాండే, గోపాల మిత్ర పోశెట్టి, జీపీ సిబ్బంది సురేశ్, అశోక్, పవన్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.


