నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Mar 16 2026 7:22 AM | Updated on Mar 16 2026 7:22 AM

న్యూస్‌రీల్‌

అకాల జల్లు.. రైతు గుండెగుబిల్లు

వాతావరణం

ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.

బ్రహ్మోత్సవాలు సంపూర్ణం..

మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లిలోని

ఇందూరు తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి.

సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026

– 8లో u

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్ట్టుండి ఆదివారం వాతావరణం మారిపోయింది. సాయంత్రం వేళం ఆకాశం మేఘావృతమై ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ అక్కడక్కడా వర్షపు జల్లులు కురిశాయి. నిర్మల్‌, భైంసా ప్రాంతాలతోపాటు సరిహద్దులోని మహారాష్ట్రలో ఉన్న ధర్మాబాద్‌ ప్రాంతంలో ఈదురు గాలులతో వడగళ్ల వర్షం కురవగా.. ఆ ప్రభావం జిల్లాపై కొంత వరకు కనిపించింది. బోధన్‌, రెంజల్‌, నవీపేట్‌, నిజామాబాద్‌రూరల్‌, మాక్లూర్‌, నందిపేట్‌, డొంకేశ్వర్‌ మండలాల్లో ఉరుములు మెరుపులతో చినుకులు కురిశాయి. – డొంకేశ్వర్‌(ఆర్మూర్‌)

అన్నదాతల్లో ఆందోళన

అక్కడక్కడా కురిసిన తేలికపాటి వర్షపు జల్లులు రైతుల్లో తీవ్ర ఆందోళనను కలిగించాయి. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని చోట్ల పసుపు కల్లాల్లోనే ఉంది. ఆరబోసిన పసుపు కొమ్ములు వర్షానికి తడకుండా కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పారు. ఈదురు గాలుకు అవి లేచిపోకుండా బండరాళ్లు, చెట్ల మొద్దులను అడ్డుగా పెట్టారు. అలాగే మొక్కజొన్న పంట కోత దశలో ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి నెలాఖరులో ఈదురు గాలుల వర్షానికి పలు ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో మక్క నేలకొరిగి రైతులకు నష్టం జరిగింది. మళ్లీ ఇప్పుడు అకాల వర్షం కారణంగా మక్కకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జొన్న పంటకు సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు జిల్లాకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కల్లాల్లో ఉన్న ధాన్యంపై టర్పాలిన్లు కప్పి ఉంచాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షపు చినుకులు

మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement