వేటాడుతున్న పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

వేటాడుతున్న పెద్దపులి

Mar 16 2026 7:22 AM | Updated on Mar 16 2026 7:22 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): నిజామాబాద్‌–సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల అటవీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న పెద్దపులి తన వేట కొనసాగిస్తోంది. ఇటీవల జిల్లాలోని కమ్మర్‌పల్లి రేంజ్‌ పరిధిలో ఉన్న భీమ్‌గల్‌ మండలం దే వక్కపేట్‌ అడవుల్లో రెండు ఆవులను చంపిన పె ద్దపులి, తాజాగా జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించి అక్కడ వేట మొదలు పెట్టింది. కొడి మ్యాల రేంజ్‌ దమ్మాయిపేట్‌ అటవీ ప్రాంతంలో ఓ రైతు కట్టేసి ఉంచిన ఆవుపై దాడి చేసి హత మార్చిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఆవు మాంసాన్ని కొంత మేర ఆరగించి వెళ్లింది. సమాచా రం అందుకున్న అటవీ అధికారులు ఘ టనా స్థలాన్ని పరిశీలించారు. రోజుకు 20 కిలో మీట ర్లు సంచరిస్తున్న పులి మూడు జిల్లాలను హడలెత్తిస్తోంది. ఇదే పులి గత కొన్ని రోజుల క్రితం రా జన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లంతకుంట, తిప్పాపురం అడవుల్లో నాలుగు ఆవులను చంపేసింది. ఇప్పటి వరకు ఏడు ఆవులను హతమార్చింది. రోజుకో చోట వేటాడి మూడు జిల్లాల అటవీ అధికారులకు నిద్ర లే కుండా చేస్తోంది. అదృష్టవశాత్తు మనుషులపై ఎలాంటి దాడులు చేయ డం లేదు. పెద్దపులి వే ట నేపథ్యంలో రైతులను, పశువుల కాపర్లను, అడవులకు సమీప గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ పులి మ నుషులపై దాడి చేసే పరిస్థితి ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకుని దానిని పట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

జగిత్యాల వైపు వెళ్లి

మరో ఆవును చంపిన టైగర్‌

మూడు జిల్లాల అటవీ

సరిహద్దుల్లో హడల్‌

రోజుకు 20 కిలోమీటర్ల మేర

సంచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement