అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి

Mar 16 2026 7:22 AM | Updated on Mar 16 2026 7:22 AM

బాన్సువాడ సెగ్మెంట్‌కు 150 ఫంక్షన్‌హాల్స్‌ మంజూరు

ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రుద్రూర్‌/వర్ని: నియోజకవర్గంలో కనీస వసతుల కల్పన, విద్య, వైద్య సేవలతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేదలు తక్కువ వ్యయంతో శుభకార్యాలు నిర్వహించుకునేలా బాన్సువాడ నియోజకవర్గంలో 150 ఫంక్షన్‌ హాళ్లు మంజూరు చేశామన్నారు. రుద్రూర్‌ మండలం అక్బర్‌నగర్‌లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న జనరల్‌ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఒకే నియోజకవర్గానికి ఇంతపెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు కావడం అరుదని అన్నారు.

అనంతరం వర్ని మండలం శ్రీనగర్‌లో అంగన్‌వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తహసీల్దార్‌ తారాబాయి, సర్పంచులు సీతారామరాజు (రాంబాబు), పూర్ణిమ కిరణ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేశ్‌బాబా, నాయకులు బుజ్జన్న, నరోజి గంగారాం, తోట అరుణ్‌ కుమార్‌, పట్టెపు రాములు, అనిల్‌ పటేల్‌, మారుతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement