నిజామాబాద్ రూరల్: కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్‌లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 16న కలెక్టరేట్, 23న హైదరాబాద్ లేబర్ కమిషనరేట్‌ఎదుట నిర్వహించే ధర్నాల పోస్టర్లను శ్రద్ధానంద్‌గంజ్‌లో నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఏప్రిల్ ఒకటి నుంచి కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్‌లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. నాయకులు మేసినేని రాజు, మతిన్, శ్రీనివాస్, ఇమ్రాన్, జగన్, రసూల్, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయానికి రూ. 50లక్షల నిధులు మంజూరు కావడంపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయం చైర్మన్ చెరువుపల్లి గురు ప్రసాద్, గౌరవ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మదగాని మారయ్య గౌడ్, కోశాధికారి పెండ్యాల శ్రీనివాస్, ఉపచైర్మన్, మాజీ కార్పొరేటర్ డీ రాజేంద్రప్రసాద్, తాటి వీరేశం తదితరులు ఉన్నారు.
సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో హనుమాన్ మాలధారణ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ రామాంజనేయ స్వామి మెట్ల పూజను శనివారం వైభవంగా నిర్వహించారు. అరటి ఆకులు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో దేవేరుల చిత్ర పటాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. గ్రామంలోని యువకులు, పెద్దలు, చిన్నారులు పూజలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న సర్పంచ్ నర్మల లతభాస్కర్‌రెడ్డిని హనుమాన్ మాలధారులు శాలువాతో సన్మానించారు.


