అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం

Mar 15 2026 5:10 AM | Updated on Mar 15 2026 5:10 AM

ప్రభుత్వ సలహాదారు,

బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

జాన్కంపేటలో ముస్లింలకు

రంజాన్‌ తోఫాల పంపిణీ

బోధన్‌: అన్నివర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యే యమని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్‌ తో ఫాలను ముస్లింలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అథితిగా హాజరైన ఎమ్మెల్యే తో ఫాలను పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తోందన్నారు. రేషన్‌ దుకాణా ల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. పవిత్ర రంజాన్‌ పండుగను ఆనందంతో జరుపుకోవాలని ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్‌ అనురాధ రాధకిషన్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ నీలం కృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్‌, నాయకులు అశ్వక్‌, జహిరొద్దీన్‌, ఏసీపీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాల కబ్జాలపై దృష్టి సారించాలి

నవీపేట: ప్రభుత్వ స్థలాల కబ్జాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. నవీపేట మండల కేంద్రంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కబ్జాదారులపై రెవెన్యూ, జీపీ, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురైతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కష్టమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బోరుబావులు తవ్వుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, రాజేందర్‌గౌడ్‌, గోవర్ధన్‌రెడ్డి, సాయిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement