సిరికొండ: వ్యవసాయ కూలీలు, కార్మికులు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపు అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ అన్నారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో సంఘం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆయన శనివారం ఆవిష్కరించారు. మహాసభలను కామారెడ్డిలో ఈ నెల 24, 25న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికుల ఉద్యమ బలోపేతం కోసం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ అన్ని చెబుతున్న ప్రధాని కూలీల కోసం ఒక్క పథకం అమలు చేయడం లేదని విమర్శించారు. కూలీల కోసం ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలకు తెర లేపిందని వాపోయారు. మహాసభలకు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ తదితరులు రాన్నునట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దామోదర్, లింబాద్రి, గంగాధర్, కిరణ్, రాములు, రాజు, రఫీక్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.


