నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దు

Mar 15 2026 5:10 AM | Updated on Mar 15 2026 5:10 AM

రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయాలి

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్‌

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్‌ డిమాండ్‌ చేశారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ 7వ మహాసభ నిర్వహించారు. ముందుగా ఇటీవల మరణించిన విద్యార్థి నాయకులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలకు పెద్దపీట వేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. తెయూకు తక్కువ నిధులు కేటాయించడం దారుణమన్నారు. వర్సిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు.

తెయూ ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్సిటీ నూతన అధ్యక్షుడిగా వినీత్‌, కార్యదర్శిగా చక్రి, ఆఫీస్‌ బేరర్స్‌గా ఆదిత్య, నిరంజన్‌, బాలమణి, కారుణ్య, వంశీ, కమిటీ సభ్యులుగా నాగేంద్ర, మోక్షిత్‌, సరిత ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్‌ తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్‌, జిల్లా అధ్యక్షురాలు దీపిక, వర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement