మంజీర నదిలో మునిగి ఒకరి మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని చీనూర్ గ్రామానికి చెందిన రంగి యేసయ్య(44) శనివారం మంజీర నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. నదిలో నుంచి మోటార్‌ను తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
గుంతలో పడి ఒకరు..
బోధన్: ప్రమాదవశాత్తు బో రుబావి వద్ద గుంతలో పడి ఒకరు మృతి చెందారు. రెంజ ల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోగుల గంగాధర్(25) ఎడపల్లి మండలంలోని దూపల్లి గేట్ సమీపంలో పంట పొలాల మధ్య ఉన్న బోరుబావి వద్ద గల గుంతలో ప్రమా దవశాత్తు పడి మృతి చెందాడు. గంగాధర్ రోజు మాదిరిగా శుక్రవారం కూలి పని కోసం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఆచూకీ కోసం ఆరా తీశారు. శనివారం ఉదయం స్థానికుల సమాచారం మేర కు ఘటన స్థలానికి వచ్చి మృతుడిని గుర్తించారు. బోరుబావి వద్ద నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడిపో యి మృతి చెంది ఉంటాడని, మృతుడి తమ్ముడు రమేశ్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమ తెలిపారు.
చికిత్స పొందుతూ వివాహిత ..
రుద్రూర్: పోతంగల్ మండలం హంగర్గా ఫారానికి చెందిన కుంటన రమ (30) అనే వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. రమ భర్త మద్యానికి బానిసై పని చేయకపోవడంతో కుటుంబపోషణ విషయమై తీవ్రంగా ఇబ్బందిపడేది. ఈ నెల 12న సాయంత్రం రమ గుర్తుతెలియని పురుగుల మందు సేవించింది. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. మృతురాలి తల్లి సోన్ కాంబ్లె లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


