15 ఎకరాల్లో సాగు చేశాం
త్వరలో ప్రారంభిస్తాం
● జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా
విస్తీర్ణంలో సాగైన శనగ
● ఏడు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
తీసుకుంటున్న మార్క్‌ఫెడ్
బోధన్‌రూరల్: జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. వ్యవసాయ శాఖ అందించిన పంట సాగు వివరాలతో శనగను కొనుగోలు చేసేందుకు మార్కెఫెడ్ అధికారులు నాఫెడ్‌కు నివేదికలు అందించారు. ఎకరానికి 10 క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కోరగా నాఫెడ్ అనుమతులతో రైతుల నుంచి శనగను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో మొత్తం ఏడు శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బోధన్ మండలంలోని కల్దుర్కి, మావంది కాలన్, రెంజల్ మండలం నీలా, సాలూర మండలంలో సాలూర, హున్సా, పొతంగల్ మండల కేంద్రం, వర్ని మండలం జాకోరాలో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఎకరానికి 7 నుంచి 9 క్వింటాళ్లు
ఈ యాసంగి సీజన్‌లో జిలాల్లో సుమారు 12వేల ఎ కరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారు. అత్యధిక బోధన్ డివిజన్‌లోని రెంజల్, సాలూర, బోధన్, పొతంగల్ మండలాల్లో శనగ పండించారు. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో శనగ పంట దిగుబడులు బాగున్నాయని, ఎకరానికి 7 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు.
ఆలస్యంతో పలువురికి నష్టం
పక్షం రోజుల క్రితమే జిల్లాలో శనగ కోతలు పూర్తవ్వగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జ రగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పొ లాలు, అత్యవసర పరిస్థితులు ఉన్న రైతులు దళారు లకు తక్కువ ధరకే పంటను అమ్ముకొని నష్టపోయారు.ప్రభుత్వ మద్దతు ధర రూ.5,875 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు రూ. 5,100, రూ.5,200కే రైతుల నుంచి కొనుగోలు చే శారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.600 నుంచి రూ.800 వరకు నష్టపోయారు.
15 ఎకరాల్లో శనగ పంటను సాగు చేశాం. కోతలు పూర్తి చే సి శనగలను నిలువ చేసి పెట్టా ను. 20 రోజులైనా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నాం. అఽ దికారులు స్పందించి శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. – కుర్లె మొగులయ్య, కల్దుర్కి
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం ఏడు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ సాగుతోంది. మరో మూడు రోజుల్లో ప్రారంభించి రైతుల నుంచి శనగలను కొనుగోలు చేస్తాం. రైతులు దళారులకు శనగలను విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. – మహేశ్ కుమార్,
మార్కెఫెడ్ జిల్లా మేనేజర్


