● రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
● కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ
ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఇందిరమ్మ రాజ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 246 మంది లబ్ధిదారులకు రూ. 2,46,28,536 విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 153 మందికి రూ.7,65,00,000 విలువ చేసే ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళలకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ అన్ని పథకాలూ వారి పేరిటే ఇస్తున్నామని గుర్తు చేశారు. అంతకుముందు డిచ్‌పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపెల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, మాజీ ఎంపీపీ భూమారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు నవీన్‌గౌడ్, ఎర్రన్న, డాక్టర్ షాదుల్లా, రాంచందర్‌గౌడ్, ధర్మాగౌడ్, వాసుబాబు, ఉమ్మాజి నరేశ్, గంగారెడ్డి, హన్మాండ్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.


