జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత శనివారం 39 డిగ్రీల వరకు నమోదైంది. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గొడుగులు పట్టుకొని, మాస్క్‌లు, స్కార్ప్‌లు పెట్టుకొని వెళ్తున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
ఎండ వేడిమి నుంచి రక్షణ పొందడానికి స్కార్ఫ్, చీరకొంగు, చేతి రుమాలును తలకు చుట్టుకొని వెళుతున్న వాహనదారులు


