మృత్యువులోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహం

Mar 15 2026 5:05 AM | Updated on Mar 15 2026 5:05 AM

ఆర్మూర్‌ మండలం

పిప్రిలో ఆటో, స్కూటీ ఢీ

ఇద్దరు యువకులు మృతి

ఒంటరైన తల్లులు

ఆర్మూర్‌టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందిన ఘటన ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. పిప్రి గ్రామానికి చెందిన సంచు శ్రీనివాస్‌(40), ఆర్మూర్‌కు చెందిన దయ్య విజయ్‌(33) ఇద్దరూ స్నేహితులు. శ్రీనివాస్‌ ఆర్మూర్‌లోని ఓ బా ర్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. విజయ్‌ సైతం గతంలో నాలుగు నెలలపాటు అదే బార్‌లో పనిచేశాడు. అయితే, ఈ నెల 4న విజయ్‌ ఇజ్రాయెల్‌ దేశానికి వెళ్లాల్సి ఉండగా, యుద్ధ పరిస్థితుల నేప థ్యంలో విమానాలు రద్దు కావడంతో వెళ్లలేదు. అ యితే, శనివారం ఉదయం శ్రీనివాస్‌, విజయ్‌ కలిసి స్కూటీపై ఆర్మూర్‌ వైపు వస్తూ ఆర్మూర్‌ నుంచి నందిపేటకు వెళ్తున్న ఆటోను ఢీకొని ఎగిరిపడ్డారు. దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారు.

కుటుంబాల్లో విషాదం..

రోడ్డు ప్రమాదంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. శ్రీనివాస్‌, విజయ్‌లకు ఇంకా పెళ్లి కాలేదు. కొన్నేళ్ల క్రితం వీరి తండ్రులు మరణించగా, తల్లుల వద్ద ఉంటూ పనులు చేసుకొని జీవ నం సాగిస్తున్నారు. కుటుంబాలకు పెద్ద దికై ్కన కొ డుకులు మరణించడంతో తల్లులు గుండెలవిసెలా రోదించారు. యువకుల మరణంతో తల్లులిద్దరూ ఒంటరివారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

దుయ్య విజయ్‌(ఫైల్‌)

సంచు శ్రీనివాస్‌(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement