అశ్వ వాహనంపై ఊరేగిన శ్రీవారు | - | Sakshi
Sakshi News home page

అశ్వ వాహనంపై ఊరేగిన శ్రీవారు

Mar 15 2026 5:05 AM | Updated on Mar 15 2026 5:05 AM

ఇందూరు తిరుమలలో

నిత్య హవన పూర్ణాహుతి

భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ

పారాయణం

నిజామాబాద్‌ రూరల్‌: మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లి గ్రామ శివాల్లోని ఇందూరు తిరుమల బ్రహ్మో త్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు ఉదయం నిత్య హవన పూర్ణాహుతి నిర్వహించారు. శనివారం సందర్భంగా సామూహిక భగవద్గీత పఠనం చేశారు. షాక్తా పరిషత్‌ బృందం గురువు పవన్‌ శర్మ, మహిళా శిష్య బృందం భక్తశ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, సౌందర్య లహరి సామూహిక గానం చేశారు. దీంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సాయంత్రం స్వామివారు అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. అశ్వ వాహనంపై వచ్చిన శ్రీవారు సిరి సంపదలను తీసుకొని వస్తాడని దేవనాథ జీయర్‌ స్వామి తెలిపారు. అనంతరం దోపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు. కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి, సినీ నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌, విజయసింహా రెడ్డి, డీసీపీ బస్వారెడ్డి, సాయిరెడ్డి, ఎంపీటీసీ రాము లు, నర్సారెడ్డి, పృథ్వీ, ప్రవీణ్‌, నరాల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement