కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి అటవీ రేంజ్‌లో పె ద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అ ధికారులకు పూణేలోని టైగర్ రెస్క్యూ టీం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వెటర్నరీ డాక్టర్ అవగాహన కల్పించారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని అటవీ క్షేత్ర పరిధి కార్యాలయంలో రిజర్వ్ ఫారెస్ట్ లోపల, బయట పెద్దపులి కదలికలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. పెద్దపులి కదలికలను ఎలా గుర్తించాలి, దాని స్థానాలను గుర్తించడం ద్వారా ట్రాప్ కెమెరాను ఎలా అమర్చాలి, ఎలా ప్రశాంత పర్చాలనే అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పులి ప్రవర్తనను వివరించారు. ఎఫ్‌ఆర్‌వో రవీందర్, డీఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్, కమ్మర్‌పల్లి, సిరికొండ, ఇందల్వాయి రేంజ్‌ల సిబ్బందితోపాటు బేస్ క్యాంప్ వాచర్లు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ గేమింగ్‌కు యువకుడు బలి
● డబ్బులు పోవడంతో ఆత్మహత్య
డిచ్‌పల్లి: ఆన్‌లైన్ గేమింగ్ భూతానికి మరొక యువకుడు బలయ్యాడు. డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్ అరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నడిపల్లి తండాకు చెందిన బదావత్ అరుణ్(20) శనివారం తెల్లవారుజామున తమ రేకుల ఇంట్లో ఇనుపరాడ్‌కు టవల్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుటుంబీకులు గమనించే సరికే అరుణ్ మృతి చెంది ఉన్నాడు. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడిన అరుణ్ డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైనట్లు సమాచారం. అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడి తండ్రి పండరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
16న జీజీ కాలేజీలో మెగా జాబ్‌మేళా
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరీర్ గైడెన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16న మెగా జాబ్‌మేళా ని ర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ దయం 9:30 నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతుందన్నారు. మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెక్ మహీంద్ర, ముత్తూట్, జస్ట్ డయల్, టాటా ఏఐజీ, బ్యాంకింగ్, ఐటీ సర్వీస్‌తోపాటు వివిధ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం చి వరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అర్హులు బయోడేటా, సర్టిఫికెట్లు, పీపీ సైజ్ ఫొటోలతో ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు. సందేహాలుంటే 9059344379, 9494559027 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


