నిద్రలోనే మృత్యు ఒడికి | - | Sakshi
Sakshi News home page

నిద్రలోనే మృత్యు ఒడికి

Mar 14 2026 7:28 AM | Updated on Mar 14 2026 7:28 AM

జాతీయ రహదారిపై గన్నారం వద్ద ప్రమాదానికి గురైన ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు

డిచ్‌పల్లి/నిజామాబాద్‌ అర్బన్‌/ఇందల్వాయి: ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ప్రైవేట్‌ బస్సు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు నిద్రలోనే మృతు ఒడికి చేరుకున్నారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.30 గంటల సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కి పడి లేచి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు బోల్తా పడగా కళ్లముందే ముగ్గురు మృతి చెందడం, మిగిలిన వారిలో పలువురికి కాళ్లు, చేతులు విరగడం, తలలు పగలడం, సామగ్రి చెల్లాచెదురుగా పడిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆర్తనాదాలు చేశారు. గాయపడ్డ వారి రోదనలతో ఘటనా స్థలం దద్దరిల్లింది.

బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా 17మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌, 18 మంది ప్రయాణికులు మొత్తం 21 మందితో ఖురానా ట్రావెల్స్‌ బస్సు (నెంబరు ఎంపీ 13 పీ 3899) బయలుదేరింది. గన్నారం శివారు బ్రహ్మంగారి ఆలయం వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ సంజయ్‌ అతివేగంగా అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్క ఉన్న హెచ్చరిక బోర్డు ను ఢీకొని రోడ్డు కిందకు దిగిపోయి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న మైగం మంజుషా(32), మైగం రుషి(7), రాహుల్‌ (40) అక్కడికక్కడే మృతి చెందగా, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్బాస్‌ (35) మృతి చెందాడు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే వీరందరిని పోలీసులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి తో పాటు ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర అకోలా, వాషిమ్‌, నాందేడ్‌ ప్రాంతాలకు చెందిన వీరంతా ఇక్కడ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కన్నీరుమున్నీరయ్యారు. గా యపడిన వారిలో ఐదురుగురు ప్రైవేట్‌ ఆస్పత్రిలో, మిగిలిన వారు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాకు చెందిన లక్ష్మన్‌ గాయపడగా, అతని భార్య మంజు ష, కొడుకు రిషి మృతి చెందారు. గాయపడిన వా రిలో యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన ఒకరు, బెంగుళూరుకు చెందిన ఒకరు ఉండగా, ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ

చికిత్స పొందుతూ మృతి

చెందిన అబ్బాస్‌(బెంగళూరు)

ప్రమాదంలో గాయపడి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స

పొందుతున్న బాలుడు కార్తీక్‌, అతిఽథి(అకోలా)

జాతీయ రహదారిపై గన్నారం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా

నలుగురు మృతి, 17 మందికి

తీవ్ర గాయాలు

మృతుల్లో తల్లీకొడుకులు

కళ్లముందు శవాలు, రక్తమోడుతున్న

శరీరాలతో భయకంపితులైన

ప్రయాణికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement