లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

Mar 13 2026 8:57 AM | Updated on Mar 13 2026 8:57 AM

జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి

నిజామాబాద్‌ లీగల్‌: ఈ నెల 28న నిర్వహించను న్న లోక్‌ అదాలత్‌ను సమష్టిగా విజయవంతం చేయాలని జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి పేర్కొ న్నారు. కోర్టులోని బార్‌ హాల్‌లో గురువారం న్యా యవాదులతో నిర్వహించిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. కక్షిదారుల్లో సరైన అవగాహన లేక కోర్టుల్లో అనేక సంవత్సరాలుగా కేసులు పెండింగ్‌ లో ఉంటున్నాయని, వాటి సత్వర పరిష్కారం కోసం కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. బార్‌, బెంచ్‌ మధ్య సయోధ్యతో కేసులను సత్వరం పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ కోర్టు ల్లో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా జడ్జికి వివరించగా, న్యాయమూర్తులతో మా ట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, బట్టు మాణిక్‌రాజు, న్యాయమూర్తులు హరీషా, శ్రీనివాసరావు, ధరావత్‌ దుర్గాప్రసాద్‌, వరూధిని, గోపీకృష్ణ, కుష్బూ ఉపాధ్యాయ, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement