● బోధన్ ఉషోదయ డిగ్రీ
కళాశాలలో నిర్వహణ
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొనగా 450 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 277 మందిని 11 కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. అనంతరం వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లు, కళాశాల సెక్రెటరీ, టాస్క్ జిల్లా అధికారి రఘుతేజ ఆధ్వర్యంలో నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ మాట్లాడుతూ తెలంగాణ నైపుణ్యాల సంస్థ (టాస్క్) ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించామని, ప్రముఖ కంపెనీలైన టాటా స్ట్రేవ్, హిట్రో, ఫార్మా శ్రీరామ్, పర్చూర్ ద ఎంపైర్ గ్రూప్, టీసీఎస్, మెడ్‌ప్లస్, విజయ ఫర్టిలైజర్స్, ఏజే సొల్యూషన్స్ పాల్గొన్నాయని తెలిపారు. ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యతోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నైపుణ్యాలపై తర్ఫీదునిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి విద్యతోపాటు సాంకేతికపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు గంగాధర్, హరి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


