ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. పరీక్షలు ముగియడంతో కేంద్రాల వద్ద విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తూ కనిపించారు. కేరింతలు కొడుతూ స్నేహితులకు వీడ్కోలు పలికారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు తమ లగేజీలను పట్టుకొని ఇంటిబాట పట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంగణాలు కిటకిటలాడాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
లగేజీతో ఇంటికి వెళ్తున్న విద్యార్థి
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్
బస్సులో సీటు కోసం..


