టేబుల్‌ టెన్నిస్‌లో అదరహో | - | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌లో అదరహో

Mar 13 2026 7:40 AM | Updated on Mar 13 2026 7:40 AM

ప్రతిభకు అనుకూలంగా ప్రోత్సాహం

కోచ్‌ వల్లే ఉత్తమ ప్రదర్శన

ప్రతిభ చాటుతున్న

కాకతీయ విద్యార్థులు

జిల్లా, రాష్ట్రస్థాయి

బహుమతులు కై వసం

నిజామాబాద్‌ అర్బన్‌: పిల్లల్ని ప్రోత్సహిస్తే ఎందులోనైనా రాణిస్తారు. చదువులు, ఆటపాటల్లో ఒకేసారి సత్తాచాటుతారు. చదువులో ప్రతిభ చాటుతూనే టేబుల్‌ టెన్నిస్‌లో తిరుగులేదంటున్నారు జిల్లాకు చెందిన కాకతీయ పాఠశాల విద్యార్థులు. కోచ్‌ వినయ్‌ సాగర్‌ సలహాలు, సూచనలు పాటిస్తూ ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. కాకతీయ ఒలంపియాడ్‌ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి షేక్‌ నౌషన్‌ మూడేళ్లలో జిల్లా స్థాయిలో పోటీపడి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. 2023 ఎస్జీఎఫ్‌ అండర్‌–14లో జిల్లా స్థాయి ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యాడు. 2024 అండర్‌–17లో భాగంగా రాష్ట్రస్థాయిలో ఆడి మూడో స్థానంలో నిలిచాడు. 2024 జిల్లా స్థాయి సీఎం కప్‌ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. 2025 ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17లో జిల్లా స్థాయి ప్రథమ, సీఎం కప్‌ పోటీలలో రాష్ట్రస్థాయి బహుమతులు సాధించాడు. పదో తరగతికి చెందిన మరో విద్యార్థి భవానీ ప్రసాద్‌ 2024 ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 టేబుల్‌ టెన్నిస్‌ పోటీలలో జిల్లాస్థాయిలో రెండో స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచాడు. 2025 ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. 2024, 2025 సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించాడు.

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దానికి అనుకూలంగా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం. భవానీప్రసాద్‌ టేబుల్‌ టెన్నిస్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. క్రీడాకారులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతా.

– వినయ్‌సాగర్‌, కోచ్‌

మా కోచ్‌ వల్లే నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతున్నాను. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకువస్తాను.

– భవానీ ప్రసాద్‌, క్రీడాకారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement