ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరి మృతి

Mar 13 2026 7:40 AM | Updated on Mar 13 2026 7:40 AM

ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరి మృతి జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్ర శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట మండలంలోని లొంకలపల్లి గ్రా మానికి చెందిన తొనిగండ్ల సంజీవులు(58)కు 35ఏళ్ల క్రితం వివాహం జ రిగింది. జీవనోపాధి నిమిత్తం సంజీవులు తన భార్యతో కలిసి ముంబై వెళ్లాడు. అక్కడ గ్యాస్‌ సిలిండర్‌ లీకై జరిగిన ప్రమాదంలో భార్య మరణించింది. అప్పటి నుంచి సంజీవులు మతిస్థిమితం కోల్పోయి లొంకలపల్లి లోని తమ్ముడు సాయిలు వద్దే ఉంటున్నాడు. సంజీవులు అప్పుడప్పుడు సైకిల్‌పై శెట్పల్లి సంగారెడ్డి, గోపాల్‌పేట గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటాడు. గురువారం నాగిరెడ్డిపేట గ్రామశివారులోని పటేల్‌చెరువు గట్టుపై సంజీవులుకు చెందిన సైకిల్‌ ఉండగా చెరువులో మృతదేహాం తేలియాడుతుందని తెలుసుకొని సాయిలు అక్కడికి వెళ్లి చూడగా సంజీవులు మృతదేహంగా గుర్తించారు. సంజీవులు కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పటేల్‌ చెరువులోపడి మృతిచెందినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి పోచారం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని ఏర్రారం గ్రామానికి చెందిన దూదేకుల జహంగీర్‌(25)కు షన్నుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం ఐదేళ్లుగా మెదక్‌లో నివసిస్తున్నారు. కాగా, ఈ నెల 11న ఉదయం పాలు తీసుకువస్తానని చెప్పి జహంగీర్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య షన్ను కుటుంబ సభ్యుల సహకారంతో జహంగీర్‌ కోసం పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం పోచారం ప్రాజెక్టులో మృతదేహాం తేలియాడుతుండ డాన్ని గుర్తించి జాలర్లు బయటికి తీశారు. మృతుడు జహంగీర్‌గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement