ఉద్యాన పంటలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటలపై అవగాహన

Mar 12 2026 7:15 AM | Updated on Mar 12 2026 7:15 AM

రుద్రూర్‌: పోతంగల్‌ మండలం కొడిచర్ల గ్రామంలో తెలంగాణ ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీమతి భారతి మాట్లాడుతూ.. మిషన్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పథకం ద్వారా ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, పథకాల గూర్చి వివరించారు. రుద్రూర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం కీటక శాస్త్రవేత్త సాయిచరణ్‌ మాట్లాడుతూ.. రైతులకు మిరప సాగులో వచ్చే నల్ల తామర పురుగుల నియంత్రణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను వివరించారు. అలాగే వివిధ కూరగాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉద్యానశాఖ అధికారి వహీద్‌ మా ట్లాడుతూ.. రైతు పొలంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథ కాల ప్రయోజనాలు పొందే విధానాలను వివరించారు. అనంతరం అధికారులు, శాస్త్రవేత్తలు మిరప సాగు చేస్తున్న రైతుల పొలాలను సందర్శించారు. పొలాల్లో నల్ల తామర పురుగులు కనిపించడంతో వాటి నియంత్రణ కోసం ఎకరాకు 30 నుంచి 35 నీలిరంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలని సూ చించారు. అలాగే బ్రోఫ్లానిలైడ్‌ 34 మి.లీ లేదా డై ఫెంతియురాన్‌ 300 గ్రాములు లేదా ఫిప్రోనిల్‌ 80 డబ్ల్యూజీ 20 గ్రాములు ఎకరాకు మారుస్తూ పిచి కారీ చేయాలని సూచించారు. హెచ్‌ఈవో అస్రర్‌, ఆదర్శ రైతు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement