న్యూస్‌రీల్
వాతావరణం
ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఎండ తీక్షణంగా కాస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రి నిర్మలంగా ఉంటుంది.
ప్రతిఫలం, స్వార్థం లేకుండా..
స్వార్థం లేకుండా.. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రవచించారు.
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
– IIలో u
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో
పెరిగిన నిత్యావసరాల ధరలు
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం వంటింటి మీద కనబడుతోంది. వారం పది రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర సిలిండర్‌పై రూ. 60 పెరగ్గా.. నిత్యావసర వస్తువుల ధరలూ అదే దారిలో పయనిస్తున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
– నిజామాబాద్ రూరల్
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ మొన్నటి వరకు రూ. 143 వరకు ఉండగా.. ఇప్పుడు రూ. 175కు చేరింది. అలాగే పామాయిల్ లీటర్ ధర రూ. 120 నుంచి రూ. 135 కు పెరిగింది. పల్లి నూనె ధర లీటర్‌కు రూ. 160 ఉండగా, ఇప్పుడు రూ. 175 కి విక్రయిస్తున్నారు. పప్పుల ధరలూ కిలోకు రూ. 20 నుంచి రూ. 25 దాకా పెరిగాయి. కందిపప్పు కిలో రూ. 125 ఉండగా ఇప్పుడు రూ. 145 కు అమ్ముతున్నారు. మినపపప్పు ధర కిలోకు రూ. 120 నుంచి రూ. 140కి చేరింది. ఇతర వస్తువులు ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే సిలిండర్ ధర రూ.60 పెరిగిన విషయం తెలిసిందే.
పెరగనున్న ఖర్చులు..
మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు రావడంతో భా రీ సంఖ్యలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుగుతున్నాయి. అయితే ధ రల మోత కారణంగా పెళ్లి ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెరిగిన నేపథ్యంలో భోజనాల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పటికే శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల సామగ్రి ధరలను పెంచేసి అమ్ముతున్నారు. మరోవైపు ధరల పెరుగుదలతో ఇంటి బడ్జెట్ కూడా పెరగనుంది. అసలే వేసవి కాలం కావడంతో కరంటు బిల్లుల మోత కూడా తోడవనుంది. ఇళ్లల్లో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు రాత్రింబవళ్లు నడిపించాల్సి వస్తుంది. దీంతో విద్యుత్ చార్జీ భారం ఎక్కువ అవుతుంది. వెరసి నెలవారీ ఖర్చు రెట్టింపై సామాన్యుడికి ఇబ్బందికరంగా మారనుంది.
వంటింటికి యుద్ధం సెగ!
సిలిండర్ ధర రూ.60 పెంపు
నూనెలు, పప్పుల ధరలకు రెక్కలు
సామాన్యుడిపై తీవ్ర ప్రభావం


