377 మంది విద్యార్థుల గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

377 మంది విద్యార్థుల గైర్హాజరు

Mar 11 2026 8:34 AM | Updated on Mar 11 2026 8:34 AM

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

ఖలీల్‌వాడి: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సెకండియర్‌ భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం, ఒకేషనల్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది (97.7శాతం) హాజరుకాగా, 377 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రవికుమార్‌ వివరించారు. మొత్తం 58 సెంటర్లకు గాను 55 సెంటర్లను తనిఖీ చేశామని తెలిపారు.

15 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల (2025 – 2026) బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ డిగ్రీ విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ రామోహ్మన్‌రెడ్డి, కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ భరత్‌రాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో, నాల్గో సెమిస్టర్లు (రెగ్యులర్‌)తోపాటు ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు సంబంధించి ఫీజును ఈనెల 15వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వన్‌ టైం చాన్స్‌ కింద 2014–15 నుంచి 2019–20 వరకు పూర్వపు డిగ్రీ విద్యార్థులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక

మోపాల్‌: ఏకలవ్య స్పోర్ట్స్‌ హబ్‌ ఆర్చరీ అకాడమీ క్రీడాకారు డు నేనావత్‌ రుత్విక్‌ ఉత్తమ ప్రతిభ కనబ ర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ట్లు కోచ్‌ ఎం రవీందర్‌ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లోని పటాన్‌చెరులోగల ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ అండర్‌–13 వ్యక్తిగత విభాగంలో రుత్విక్‌ 315 పాయింట్లు సాధించి ఎంపికయ్యాడన్నారు. ఈనెల 26 నుంచి విజయవాడలో నిర్వహించే సబ్‌ జూనియర్‌ జాతీయస్థాయి పోటీల్లో రుత్విక్‌ పాల్గొంటాడని తెలిపారు. రుత్విక్‌ను ఆర్చరీ అసో సియేషన్‌ అధ్యక్షుడు ఈగ సంజీవ్‌రెడ్డి, ప్రధా న కార్యదర్శి కె గంగరాజు, కోచ్‌ ఎం రవీందర్‌ తదితరులు అభినందించారు.

సమర్థవంతంగా

‘ప్రగతి ప్రణాళిక’

నిజామాబాద్‌ అర్బన్‌: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 99 రోజుల్లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. సీసీ టీవీ సర్వైలైన్స్‌, గ్రౌండ్‌ పెట్రోలింగ్‌, రోడ్డు భద్రతపై దృష్టి సారించాలన్నారు. సైబర్‌ నేరాలబారిన పడకుండా, డ్రగ్స్‌ కారణంగా తలెత్తే దుష్పరిణామాలు, భరోసా సెంటర్‌పై అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, ఐటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్‌: బొమ్మన్‌దేవ్‌పల్లి హైస్కూల్‌లో పనిచేస్తున్న ఎన్‌.శ్రీనివాస్‌ అనే టీచర్‌ను సస్పండ్‌ చేస్తూ డీఈవో రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పాఠశాలలో తోటి ఉపాధ్యాయుడిపై ఎన్‌.శ్రీనివాస్‌ కుర్చీతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement