రికార్డ్‌ స్థాయిలో యూరియా విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ స్థాయిలో యూరియా విక్రయాలు

Mar 11 2026 8:34 AM | Updated on Mar 11 2026 8:34 AM

యాసంగిలో 82 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసిన రైతులు

జిల్లాలో ఈ స్థాయిలో అమ్మకాలు

ఇదే తొలిసారి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో యాసంగి సీజన్‌ యూరియా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 82 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. గత కొన్నేళ్ల లెక్కలను తిరగేసి చూస్తే ఈ స్థాయిలో విక్రయాలు జరగడం ఇదే తొలిసారి. అయితే, ఒక్క 2020 ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రం 86,489 మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగం జరిగింది. చరిత్రలో ఏ సంవత్సరంలో కూడా యాసంగిలో 80 వేల మెట్రిక్‌ టన్నులు దాటలేదు. ఈ ఏడాదిలోనే 82 వేల మెట్రిక్‌ టన్నులు అమ్ముడయి రికార్డు నమోదైంది. జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల యూరియా డిమాండ్‌ ఉండడంతో వ్యవసాయ శాఖ మరో 1,200 మెట్రిక్‌ టన్నులు తెప్పిస్తోంది.

యాప్‌ ద్వారా అమ్మకాల జోరు

యాప్‌ విధానం వచ్చిన తర్వాత జిల్లాలో యూరియా అమ్మకాలు భారీగా పెరిగాయి. గడిచిన నెల రోజుల్లో 1,02,958 మంది రైతులు 12,877 మెట్రిక్‌ టన్నుల (2,86,173 బస్తాలు) కొనుగోలు చేశారు. యాప్‌ ద్వారా రోజుకు సగటున 430 మెట్రిక్‌ టన్నులు (9,555 బస్తాలు) అమ్ముడయ్యాయి. పంటల సాగు పెరగడంతోపాటు రైతులు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు కూడా ఇప్పుడే బస్తాలను తీసుకొని నిల్వ చేసుకుంటున్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరికి ఎకరానికి 3 నుంచి 4 బస్తాల యూరియా వాడాల్సి ఉండగా 5 నుంచి 6 బస్తాలు, కొన్ని మండలాల్లో 8 బస్తాలు కూడా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

పదేళ్లలో

విక్రయాలు ఇలా..

యాసంగిలో సాగవుతున్న ప్రధాన పంటలు (ఎకరాల్లో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement