ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

Mar 11 2026 8:34 AM | Updated on Mar 11 2026 8:34 AM

ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి

కలెక్టర్‌కు ఫోన్‌ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టి ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని కోరారు. ఈ మేరకు ఆయన కలెక్టర్‌కు మంగళవారం ఫోన్‌ చేశారు. క్వింటాల్‌ ఎర్రజొన్న ధరను రూ.3,850 నుంచి రూ.3,450కి తగ్గించడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి నెలకొందని కలెక్టర్‌కు ఆయన వివ రించారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవా లని డిమాండ్‌ చేశారు. ఎర్రజొన్న రైతులకు మేలు చేసేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎర్రజొన్న సాగు, దిగుబడి గణనీయంగా తగ్గిందని, ఈ పరిస్థితుల్లో సహజంగానే మద్దతు ధర పెరగాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా వ్యాపారులంతా కలిసి ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తుండడంతో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర తగ్గడానికి పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ను వ్యాపారులు కారణంగా చూపుతున్నారన్నారు. ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గ్గనిస్తాన్‌ దేశాలతోపాటు ఉత్తర భారతంలోని రాష్ట్రాలకు ఎ గుమతి అవుతోందన్నారు. ఈ దేశాల్లో యుద్ధ పరిస్థితు లు లేవన్నారు. గత నాలుగేళ్లుగా అమల్లో ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చే యాలని ప్రశాంత్‌రెడ్డి సూచించారు. లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలన్నారు. విత్తనాలు ఇచ్చే సమయంలో రైతులతో తప్పనిసరిగా బైబ్యాక్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్‌ రూరల్‌, జక్రాన్‌పల్లి మండలా ల్లో ఎర్రజొన్న సాగు ఎక్కువగా ఉన్నందున అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి, అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ప్రశాంత్‌రెడ్డి కోరారు. సా నుకూలంగా స్పందించిన కలెక్టర్‌ రైతులకు న్యా యం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన విలేకరు లకు తెలిపారు. ఎర్రజొన్న రైతులు సంఘటితం కావాలని.. గిట్టుబాటు ధర దక్కకపోతే పోరాటానికి సిద్ధం కావాలని, బీఆర్‌ఎస్‌ తరపున పోరాడి రైతులకు అండగా ఉంటామని ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement