● వంద శాతం పన్నులు వసూలు చేయాలి
● డీపీవో శ్రీనివాస్‌రావు
రెంజల్(బోధన్): వేసవిలో తాగు నీటికి ఇబ్బందు లు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు సూచించారు. రెంజల్ గ్రామ పంచాయతీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక అధికారులు, పాలకవర్గం సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగు నీటి పైప్‌లైన్‌ల పనులు, లికేజీలను నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేయాలన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామాలను సందర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో కార్యదర్శులతో కలిసి ఇంటి పన్ను వసూలు చేశా రు. ఎంపీడీవో కమాలకర్, ఎంపీవో రఫీయొద్దీన్ సర్పంచ్ తిరుపతి లలిత, కార్యదర్శి రాజేందర్‌రావు డీపీవోను సన్మానించారు. బోధన్ డీఎల్‌పీవో నాగరాజుతో పాటు పలు గ్రామాల కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


