సుభాష్‌నగర్: ఎర్రజొన్న క్వింటాల్ ధర రూ.4వేల కు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి సుంకెట కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ ఇలా త్రి పాఠికి ఆయన లేఖ ద్వారా విన్నవించారు. రాష్ట్రంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఎర్రజొన్న సాగవుతోందని, కానీ పంట చేతికొచ్చిన ప్రతిసారి వ్యా పారులు ధర విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పంట వచ్చిన మొదట్లో ఉన్న ధర క్రమంగా తగ్గిస్తున్నారని, ఈసారి పంట వచ్చిన మొదట్లో క్వింటాల్‌కు రూ.3900 ఇచ్చి.. ఇప్పుడు రూ.3400కు తగ్గించారని లేఖలో పేర్కొన్నారు. గతేడాది కన్నా ఈసారి సాగు విస్తీర్ణం కూడా తగ్గిందన్నారు. అయినప్పటికీ వ్యాపారులు ధర పెంచడంలేదన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మా రి ధరను తగ్గిస్తున్నారని, మా ర్కెట్ లేదని రక రకాల కారణాలు చెబుతుండడంతో రై తులు నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యే క చొరవ తీసు కుని వ్యాపారులతో మాట్లాడాలని, క్వింటాల్‌కు ధర కనీసం రూ.4వేలకు తగ్గకుండా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.


