మాక్లూర్/ మోర్తాడ్/ వేల్పూర్/ రుద్రూర్/ బోధన్/ రెంజల్/ కమ్మర్‌పల్లి: పశువుల పెంపకందారులు తమ జీవాలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో పశువైద్యాధికారులు మంగళవారం ప్రా రంభించారు. మాణిక్‌బండార్ గ్రామంలో 2వ డివిజన్ కార్పొరేటర్ మారంపల్లి మోహన్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారి బాబురావు, మాక్లూర్ మండలంలోని కొత్తపల్లిలో సర్పంచ్ వేములపల్లి రత్నకుమారి, మాక్లూర్‌లో సర్పంచ్ సాయినేని వెంకటేశ్వర్‌రావుల ఆధ్వర్యంలో మండల పశువైద్యాదికారి ఉమా సహేర్, కిరణ్‌దేశ్‌పాండే, ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో సర్పంచ్ గంగ్గోల్ల సుస్మిత ఆధ్వర్యంలో పశువైద్యాధికారి సందీప్‌లు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మోర్తాడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ భోగ ఆనంద్, ఉప సర్పంచ్ సామ శ్రీనివాస్, కార్యదర్శి సైఫొద్దీన్, పశువైద్యాధికారి గౌతమ్‌రాజ్, సిబ్బంది ప్రభాకర్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పోచంపల్లిలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ సాతాల రాజు ప్రారంభించారు. మండల వెటర్నరీ వైద్యుడు సంతోష్‌రెడ్డి పశువులకు టీకాలు వేశారు. పశువైద్య సిబ్బంది సురేశ్, గంగాధర్, దయానంద్, జావిద్, రైతులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంపులో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ పరుచూరి పద్మ ప్రారంభించారు. 99 పశువులకు టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారి సంతోష్ రెడ్డి తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ కందగట్ల రాంచందర్ ప్రారంభించారు. పశువైద్యాధికారి ప్రమోద్, సిబ్బంది పశువులకు టీకాలు వేశారు. ఉపసర్పంచ్ మచ్కూరి గంగాధర్, రైతులు సుమన్, సాయికృష్ణ, సాయికుమార్, వైద్య సిబ్బంది సుశాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ క్యాతం యోగేశ్, మండల పశు వైద్యాధికారి విఠల్ ప్రారంభించారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మండల పశు వైద్యాధికారి రాజశేఖర్‌రావు ప్రారంభించి టీకాలు వేశారు. ఉప సర్పంచ్ అశోక్, సిబ్బంది ప్రవీణ్‌రెడ్డి, స్పరన్ తదితరులు పాల్గొన్నారు.


