నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

Mar 11 2026 7:27 AM | Updated on Mar 11 2026 7:27 AM

ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి

నందిపేట్‌: ఆర్మూర్‌ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అనానరు. నందిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే లా అధికారులు చూడాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డి, ఆర్‌ఐ దివ్య, నందిపేట, డొంకేశ్వర్‌ మండలాల బీజేపీ అధ్యక్షులు పటేల్‌రాజు, చిన్నారెడ్డి, సర్పంచులు సాయి, మహేశ్‌, సంజీవ్‌, నాయకలు చిన్నా రెడ్డి, నాగసురేశ్‌, సాయినాథ్‌, అరుట్ల రమేశ్‌, కస్తూరి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే

గ్రామాల అభివృద్ధి

నందిపేట్‌: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్ర భుత్వం కట్టుబడి ఉందని పార్టీ ఆర్మూర్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని మున్నూరుకాపు కల్యాణ మండలంలో మంగళవారం ఉమ్మడి నందిపేట మండలంలోని మున్నూరుకాపు స ర్పంచులకు, ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వినయ్‌రెడ్డి సర్పంచు, ఉప సర్పంచులను సన్మానించారు. అయిలాపూర్‌ సొసైటీ చైర్మన్‌ మీసాల సుదర్శన్‌, పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపా ల్‌, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చెత్త సేకరణ ఆటోలు ప్రారంభం

వర్ని: మండలంలోని సత్యనారాయణపురం జీపీలో నూతనంగా కొనుగోలు చేసిన రెండు చెత్త సేకరణ ఆటోలను సర్పంచ్‌ కనకదుర్గ రవి మంగళవారం ప్రారంభించారు.రూ. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాంబాబు, నాయకులు సురేశ్‌, సరి చాంద్‌, రాజు పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన ప్రిన్సిపాల్‌

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల స్వామి ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ఉన్నత విద్యా శాఖ మండలి అధికారులు ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన ప్రిన్సిపాల్‌ వేణుగోపాల స్వామిని బా ల్కొండ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వేణు ప్రసా ద్‌, ఆర్మూర్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సునీత, అధ్యాపకులు అంబర్‌సింగ్‌, రహమాన్‌, శ్యామ్‌ కుమార్‌, లింగన్న ఘనంగా స న్మానించారు. కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

కమ్మర్‌పల్లి: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో బాంబు పడి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమ్మర్‌పల్లి వాసి కోయల్‌కర్‌ తిరుపతి కుటుంబాన్ని స్థానిక పోలీసులు మంగళవారం పరామర్శించారు. ఎస్సై అనిల్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది తిరుపతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడి యుద్ధ పరిస్థితులను వివరించి ధైర్యం చెప్పారు. మానసికి స్తైర్యాన్ని నింపారు.

విద్యార్థినులకు

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం గర్భాశయముఖ ద్వారా వచ్చే క్యాన్సర్‌ నివారణ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రిలో 14 నుంచి 15 ఏళ్ల వయసు గల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్మూర్‌ పట్టణంలోని సీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైద్యాధికారిణి శ్రేయ, కృష్ణమూర్తి, ప్రదీప్‌, సాయి, చంద్రశేఖర్‌, శ్యామల, చరణ్‌, బాలాజీ, సుచరిత, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement