నందిపేట్/ పెర్కిట్/ ఆర్మూర్/ బోధన్/ నవీపేట: విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి చదువుకునేలా ప్రోత్సహించిన సావిత్రిబాయి ఫూలే మహిళా లోకానికి దిక్సూచి అని పలువురు వక్తలు అన్నారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నందిపేట మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో, ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ రాక్ చర్చిలో, బోధన్ పట్టణంలోని న్యాయ సహాయ కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. నవీపేటకు చెందిన సామాజిక కార్యకర్త వడ్డెరవి ఆధ్వర్యంలో యువకులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేశారు.


