ఆర్మూర్‌టౌన్/ వేల్పూర్/ రుద్రూర్/ పెర్కిట్/ రెంజల్: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’తో గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో విద్యార్థులు మంగళవారం 2కే రన్ నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి, కమిషనర్ ఉమా మహేశ్వర్ రావు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, శానిటరి ఇన్‌స్పెక్టర్ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలం హనుమాన్‌నగర్‌లో ప్రజాపాలన ప్రణాళిక పనుల్లో భాగంగా సర్పంచ్ అల్లెపు నడ్పిమల్లయ్య మురికి కాలువకు పైపులైన్ బిగింపజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మణికంఠ, జీపీ కార్యదర్శి భరత్‌స్వరూప్ పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంతో పాటు అడ్‌కాస్‌పల్లి, బస్వాపూర్ గ్రామాల్లో చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. రుద్రూర్ మండలం సిద్ధాపూర్‌లో ఎంపీడీవో బాల గంగాధర్ పర్యటించి గ్రామంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఆలూర్ మండలం దేగాం పీహెచ్‌సీలో ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, సర్పంచ్ ఇట్టెడి లింగారెడ్డి, వైద్యులు అయేషా, రక్షిత, గీతా, సల్మాన్, సృజిల్ బాబు, వైశాలి, ఏపీఎం భూమేశ్వర్ గౌడ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రెంజల్ మండలం నీలా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎల్‌పీవో నాగరాజు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో విద్యార్థులతో 2కే రన్ నిర్వహిస్తున్న అధికారులు
హనుమాన్‌నగర్‌లో పైపులైన్ బిగింపజేస్తున్న సర్పంచ్ నడ్పి మల్లయ్య


