పెర్కిట్/ వేల్పూర్/ బోధన్: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్ ఆకాంక్షించారు. ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సమావేశానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని అన్నారు. ఎంఈవో నరేందర్ మా ట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీడీసీ అ ధ్యక్షుడు మగ్గిడి సూర్య, ఉపాధ్యాయులు, విద్యార్థు లు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ విద్యార్థులకు వీడ్కో లు కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎం శివాజీకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చ దువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు. గ్రామానికి చెందిన పడకంటి మహిపాల్‌రెడ్డి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, మనోహర్, శ్రీకాంత్, గణేశ్, నగేశ్, శ్యాం, చరణ్, సరిత పాల్గొన్నారు. బోధన్ పట్టణ కేంద్రంలోని రాకాసిపేట ప్ర భుత్వ ఉన్నత పాఠశాల(జేసీ)లో పదో తరగతి వి ద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పా ఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం కృష్ణ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతంగా రాయాలని సూచించారు. ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఖైరాన్, జ్యోతి, సంజీవ్ కుమార్, రామ్మోహన్, వెంకట్, విద్యాసాగర్, రాకేవ్, కిశోర్, నాగేశ్వర్‌రావు, స్నేహ, కల్యాణి, రాజ్యలక్షి తదితరులు పాల్గొన్నారు.


