రుద్రూర్: రుద్రూర్ మండల కేంద్రంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళ ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తహసీల్దార్ తారాబాయి హాజరై మాట్లా డారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, ఎంఈవో కట్ట శ్రీనివాస్, మండల వైద్యాధికారిణి అయేషా సిద్ధిఖా, పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు విఠల్‌రెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారంలో సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డ్వాక్రా, అంగన్‌వాడీ, హెల్త్, ఆశావర్కర్లు, జీపీ కార్మికులు పాల్గొన్నారు.
జల్లాపల్లి ఫారంలో..
రుద్రూర్‌లో ఉపాధ్యాయులను సన్మానించిన అధికారులు, ప్రజాప్రతినిధులు


