ఆర్మూర్: తెలంగాణ సర్వశిక్షాభియాన్ సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో అందించే ఉచిత ఫిజియోథెరపీని వైకల్యంతో బాధపడే పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎంఈవో రాజగంగారాం సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. భవిత కేంద్రంలో ప్రతీ వారానికి రెండు రోజులు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నామన్నారు. ఫిజియోథెరపీస్ట్ అరుణ చిన్నారులకు ఫిజియోథెరపీ అందించారు. శిబిరంలో ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్‌పర్సన్ కిషన్, సురేశ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అలేఖ్య, ఆపరేటర్ రఘు, మెసెంజర్ రవి, సీజీవీ కవిత తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు కొనసాగిన శిక్షణ
రుద్రూర్: ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ కళాశాలలో మహిళా రైతులకు మంగళవారం రెండవ రోజు శిక్షణ కార్యక్ర మం కొనసాగింది. శిక్షణలో భాగంగా గుడ్లు, మాంసం, కోడి మాంసంతో పలు విలువ ఆధారిత ఆహా ర ఉత్పత్తులను తయారు చేశారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తులను తయారు చేయడం, నిల్వ విధానాలు, ప్యాకెజింగ్, మార్కెటింగ్ అవకాశాల గూర్చి అవగాహన పెంచుకున్నా రు. కళాశాల అసోసియేట్ డీన్ కే వెంకట్ రెడ్డి, కో ర్సు డైరెక్టర్లు పీ శ్రీలత, బీ అమల పాల్గొన్నారు.


