నందిపేట్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నందిపేట మండల కేంద్రంలో నందిపేట, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశానికి మోదీ ఒక గొప్ప నాయకుడ ని అతని శక్తిని చూసి ఓర్వలేక కొందరు బీజేపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బద్దం లింగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పటేల్ రాజు, కార్యదర్శి కస్తూరి గంగాధర్, జిల్లా నాయకులు నాగ సురేశ్, సంజీవ్, గంగాధర్ గౌడ్, అరుట్ల రమేశ్, నర్సా గౌడ్, కృష్ణ, వెల్మల్ నరేందర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల నాయకులు పాల్గొన్నారు.


