చైన్‌ స్నాచింగ్‌ నిందితుడి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌ నిందితుడి రిమాండ్‌

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

చైన్‌ స్నాచింగ్‌ నిందితుడి రిమాండ్‌ ఇసుక అక్రమ నిల్వలు సీజ్‌

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని స్టేషన్‌ రోడ్డులో ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్న భారతి అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పరారవుతున్న చైన్‌ స్నాచర్‌ను సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్న విషయం తెలిసిందే. నిందితుడిని రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెంది న గుండెబోయిన స్వామిగా గుర్తించారు. రూ.4.80 లక్షల విలువైన బంగారు గొలుసును రికవరీ చేసి సోమవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.

రెంజల్‌(బోధన్‌): మండలంలోని బోర్గాం శివారులో అక్రమంగా నిల్వ చేసి చేసిన ఇసుక డంపులను సీజ్‌ చేసినట్లు తహశీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. రె వెన్యూ సిబ్బంది గుర్తించి సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకొని ఇసుక అక్రమ నిల్వల ను తహసీల్‌ కార్యాలయానికి తరలించి డంప్‌ చేయించినట్లు వివరించారు. సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను ప్రభుత్వ నిర్మాణ పనులకు అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement