కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

Mar 10 2026 7:14 AM | Updated on Mar 10 2026 7:14 AM

డిచ్‌పల్లి: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని రూర ల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని కొరట్‌పల్లి సర్పంచ్‌ పోతే ప్రభాకర్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. వారికి సోమవారం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్య మన్నారు. అనంతరం సర్పంచ్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సన్మానించారు. ఏఎంసీ చైర్మన్‌ ము ప్పగంగారెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమృతాపూర్‌ గంగాధర్‌, నాయకులు తారాచంద్‌నాయ క్‌, సర్పంచులు కోట్ల భాస్కర్‌, హేమలత లక్ష్మణ్‌, నాయకులు ధర్మాగౌడ్‌, మహేష్‌ పాల్గొన్నారు.

వినతుల స్వీకరణ

డిచ్‌పల్లి: ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతి రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ, జక్రాన్‌పల్లి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, ధర్పల్లి మండలాలకు సంబంధించిన ప్రజలు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement