నిజామాబాద్ రూరల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం మోపుతూ వంట గ్యాస్ ధరలను 60 రూపాయలు, వ్యాపార స ముదాయాలకు ఇచ్చే సిలిండర్ ధరలను రూ.115 కు కేంద్రం పెంచిందన్నారు. దీనికి నిరసనగా సో మవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్ర భుత్వ దిష్టిబొమ్మను పార్టీ శ్రేణులు దహనం చేశా రు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పైన జరుపుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పెంచుతోందన్నారు. సాకులు చూపి ఆయిల్ ఉత్పత్తిదారులైన కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచే విధంగా ధరలను పెంచడం సరైంది కాదని విమ ర్శించారు. వెంటనే ధరలను తగ్గించాలన్నారు. నా యకులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, సు జాత, విగ్నేష్, అనసూయమ్మ, అనిత, అంజయ్య, మాధవి, గణేష్, బుచ్చన్న, అశోక్, రాజు పాల్గొన్నారు.


