కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌

Mar 10 2026 7:13 AM | Updated on Mar 10 2026 7:13 AM

ప్రతిపాదనలు పంపాం..

మండలానికి ఒకటి ఏర్పాటు

ఆంగ్లమాధ్యమంలో బోధన

పేద విద్యార్థులకు అందనున్న

నాణ్యమైన విద్య

ఖలీల్‌వాడి: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని మౌలిక వసతులు, హంగులతో కార్పొరే ట్‌కు దీటుగా మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చే సింది. ప్రస్తుతం జిల్లాలోని 33 మండలాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాల, ఉ న్నత పాఠశాలలు ఒక్కచోట ఉన్నవాటిని ఎంపిక చే స్తున్నారు. పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న బ డులను గుర్తించారు. మండలానికి ఇతర గ్రామాలకు సమీపంలో ఉన్న పాఠశాలను ఎంచుకున్నారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.కోటి వరకు ఖ ర్చవుతుందని, త్వరలో నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట రెండు సంవత్సరాలపాటు సాధారణంగానే విద్యా ర్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఆ తర్వాత పరీక్షల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు.

1వ తరగతి నుంచి ప్రవేశాలు..

ప్రస్తుతం జిల్లాలో పది మోడల్‌ స్కూళ్లు ఉన్నప్పటికీ వీటిలో 6వ తరగతి నుంచి ప్రవేశాలు ఉన్నాయి. కానీ పబ్లిక్‌ పాఠశాలల్లో 1వ తరగతి నుంచే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు, అవసరమైతే ఇంటర్‌ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చె బుతున్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయి ఇంగ్లిష్‌ మీ డియంలో బోధన జరగనుంది. నిర్మాణం చేపట్టే క్రమంలో ఆ పాఠశాలలోని విద్యార్థులను సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎంపికై న బడిలోని విద్యార్థులు ఈ పబ్లిక్‌ బడిలో చదివేలా అవకాశం కల్పిస్తారు.

తెలుగు మీడియంలో చదువుకోవాలనుకునే వారికి పక్క పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌ పాఠశాలల్లో కంప్యూటర్‌, లైబ్రెరీ, సైన్స్‌ ల్యాబ్‌, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చేరే విద్యార్థులకు రవాణ సౌకర్యం సైతం కల్పించనున్నారు. ఏదేమైనా ఈ పాఠశాలల ఏర్పాటుతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

జిల్లాలో ప్రతిపాదించిన బడులు

మండలం ఏర్పాటు చేయనున్న పాఠశాల

నవీపేట్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, బినోల

నందిపేట్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, అయిలాపూర్‌

ఆర్మూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, పిప్రి

బాల్కొండ పీఎంశ్రీ, జెడ్పీహెచ్‌ఎస్‌, బాల్కొండ

ముప్కాల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, ముప్కాల్‌

మెండోరా జెడ్పీహెచ్‌ఎస్‌, మెండోరా

ఏర్గట్ల జెడ్పీహెచ్‌ఎస్‌, తాళ్లరాంపూర్‌

కమ్మర్‌పల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, చౌట్‌పల్లి

మెర్తాడ్‌ ప్రభుత్వ హెచ్‌ఎస్‌, మోర్తాడ్‌

వేల్పూర్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, వేల్పూర్‌

జక్రాన్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌, తొర్లికొండ

మాక్లూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, మాక్లూర్‌

ని.నార్త్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, దుబ్బ

ఎడపల్లి జెడ్పీఎస్‌ఎస్‌, ఎడపల్లి

రెంజల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, నీలా

బోధన్‌ ప్రభుత్వ ఎంఎం హైస్కూల్‌

కోటగిరి పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, కోటగిరి

రుద్రూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, రుద్రూర్‌

వర్ని జెడ్పీహెచ్‌ఎస్‌, వడ్డేపల్లి

ని.రూరల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, గుండారం

ని.సౌత్‌్‌ ప్రభుత్వ హెచ్‌ఎస్‌, కసాబ్‌గల్లీ

మోపాల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, మోపాల్‌

డిచ్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌, రాంపూర్‌

ఇందల్వాయి జెడ్పీహెచ్‌ఎస్‌, గన్నారం

ధర్పల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, ధర్పల్లి

భీంగల్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, పల్లికొండ

సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్‌, సిరికొండ

చందూర్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, చందూర్‌

మోస్రా జెడ్పీహెచ్‌ఎస్‌, మోస్రా

ఆలూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, ఆలూర్‌

డొంకేశ్వర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, డొంకేశ్వర్‌

సాలూరా పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, సాలూరా

పొతంగల్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, పొతంగల్‌

మండలానికి ఒక పాఠశాలను గుర్తించి ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు జాబితాను అందించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ప్రస్తుతం కొనసాగుతున్న బడులను సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నాం. ఈ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఇంగ్ల్లిష్‌ బోధన జరగనుంది. జూన్‌ నుంచి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది.

–అశోక్‌ కుమార్‌, డీఈవో, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement