నిర్లక్ష్యాన్ని సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

Mar 10 2026 7:13 AM | Updated on Mar 10 2026 7:13 AM

మోర్తాడ్‌: విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. విద్యార్థులు, సిబ్బంది ఫిర్యాదుల మేరకు విచారణ అనంతరం బాల్కొండలోని మోడల్‌ స్కూల్‌ కేర్‌ టేకర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాల్కొండలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ బాలికల విద్యాలయంతోపాటు మోడల్‌ స్కూల్‌ను కలెక్టర్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌ రూ మ్‌, కిచెన్‌లను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. కేర్‌ టేకర్‌ వీణ విధులను నిర్లక్ష్యం చేస్తూ తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు, సిబ్బంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కేర్‌ టేకర్‌ రెగ్యులర్‌గా విధులకు హాజరు కావడం లేదని, తమ బాగోగులను పట్టించుకోవడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, హాస్టల్‌లో నీటి కొరత తీవ్రస్థాయిలో ఉన్నా ప్రత్యామ్నాయ చ ర్యలు చేపట్టడం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేశా రు. కేర్‌ టేకర్‌ తమను కూడా దూషిస్తున్నారని సి బ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌.. తక్షణ విచారణకు ఆదేశించా రు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జీఈసీవో భాగ్యలక్ష్మి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా కేర్‌ టేకర్‌పై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

మోడల్‌ స్కూల్‌లో నీటి సమస్యను పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిషన్‌ భగీరథ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్‌ మైనారిటీ రెసిడెన్షియల్‌ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పదో తరగతి గదిని సందర్శించి విద్యార్థినులకు గణితంలో పలు ప్రశ్నలు వేసి, సరైన సమాధానాలు చెప్పిన బాలికలను అభినందించి చాక్లెట్‌ బాక్సులు అందజేశారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింతగా మెరుగుపరచాలని కలెక్టర్‌ సూచించారు.

విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదు

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

మైనారిటీ రెసిడెన్షియల్‌,

మోడల్‌ స్కూళ్ల తనిఖీ

మోడల్‌ పాఠశాల కేర్‌ టేకర్‌పై విద్యార్థినులు, సిబ్బంది ఫిర్యాదు

విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement