● దేవనాథ జీయర్ స్వామి
● వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తూ బ్రహ్మనే లోక కల్యాణం కోసం జరిపించే ఉత్సవమని, ఉత్సవం అంటే లోకమంతా సంతోషించడమని దేవనాథ జీయర్‌స్వామి అన్నారు. మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం యాగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతానార్తులకు గరుడ ప్రసాదం దేవనాథ జీయర్ స్వామి పంపిణీ చేశారు. సాయంత్రం స్వామి వారిని శేష వాహనంపై ఊరేగించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మత్సవాల్లో అహోబల జీయర్ స్వామితోపాటు ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, శిరీశ్‌రెడ్డి, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డితోపాటు యజ్ఞాచార్యులు శ్రీనివాసాచార్య, లక్ష్మణాచార్య, శ్రీకరాచార్య, ఆలయ ప్రధాన అర్చకులు రోహి త్ కుమారాచార్య, గ్రామస్తులు, ఆలయ సేవ కులు అశోక్, నరాల సుధాకర్, గంగాధర్, ప్రసాద్, రాజేశ్వర్, రమేశ్, సాయిలు, భాస్కర్, మురళి, ప్రమోద్, గంగారెడ్డి, భక్తులు, పాల్గొన్నారు.
నేడు చిన్నజీయర్ రాక
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళవారం ఉదయం 10 గంటలకు ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రానికి చేరుకుంటారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారి మంగళా శాసనములకు పాత్రులు కావాలని వారు కోరారు.


