ఎండ నుంచి రక్షణ కోసం టోపీ, మాస్క్
ధరించి ప్రయాణిస్తున్న వాహనదారుడు
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మార్చిలోనే భానుడు భగభగలాడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. సోమవారం 38.8 డిగ్రీలు, ఈనెల 8వ తేదీన 38.2, 7న 37.6, 6న 36.8, 5న 36.9, 4న 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం నమోదైన 38.2 ఉష్ణోగ్రత రాష్ట్రంలోనే అత్యధికం. మార్చిలోనే ఎండ తీవ్రత విపరీతంగా ఉందని, వచ్చే రెండు నెలల్లో మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. – నిజామాబాద్ అర్బన్


