రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
డిచ్‌పల్లి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పోలీసులు అన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నిబంధనలపై పోలీసులు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం డిచ్‌పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి గ్రామంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు రోడ్డు భద్రత నియమాలపై డిచ్‌పల్లి సీఐ కే వినోద్, ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ: యువత క్రీడలకు దగ్గరగా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ధర్పల్లి సీఐ భిక్షపతి సూచించారు. మండలంలోని దుప్య తండాలో ‘గంజాయి వద్దు–గ్రౌండ్ ముద్దు’ అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా కబడ్డీ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామస్తులకు రోడ్డు భద్రత అంశంపై ‘అరైవ్–అలైవ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు. ఎస్సై జే రామకృష్ణ, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు చందర్‌నాయక్, పందిమడుగు సర్పంచ్ గోవింద్ నాయక్, గంగనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్‌పల్లిలో..
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన పోటల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సీఐ సురేశ్‌కుమార్, ఎస్త్సై, గ్రామస్తులు, పాల్గొన్నారు. రూరల్ మండలంలోని గుపన్‌పల్లిలో రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ప్రజలకు రోడ్డు భద్రతనియమాల గురించి వివరించారు. గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
ధర్పల్లిలో..
ధర్పల్లి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధర్పల్లి ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి


