ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
నిజామాబాద్ అర్బన్: పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ మంగళవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారాని కి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ జిల్లా కార్యదర్శి శేఖర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు ఉన్నారు.
కాల్యెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్ రూరల్: విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు రూపొందించిన నూతన క్యాలెండర్, డై రీని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అలాగే డీఈవో అశోక్‌కుమార్‌ను సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి డైరీ, క్యాలెండర్‌ను అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పండరినాథ్, కార్యదర్శి గంగా కిషన్, రవీందర్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, భోజాగౌడ్, రంగ ప్రకాశ్, మోహన్, దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై దాడి
నిజామాబాద్‌రూరల్: మోపాల్ మండలంలోని చిన్నాపూర్‌లో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై సుస్మిత మంగళవారం తెలిపారు.ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా వారి నుంచి రూ. 17,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
మృతదేహాన్ని
ఇంటికి రప్పించడానికి ఆర్థికసాయం
నవీపేట/ నిజామాబాద్‌రూరల్: నవీపేట మండలంలోని యంచ గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు ఒమన్ దేశంలో నెల రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో కలిశారు. స్పందించిన ఆయన రూ.1.5 లక్షలను మృతుడి భార్య సావిత్రి, కుమారుడు సంజయ్‌కు అందజేశారు. తక్షణమే మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గల్ఫ్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ భీమారెడ్డి, యంచ సర్పంచ్ బేగరి సాయిలు, గ్రామస్తులు ఉన్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి


