మానవతా సదన్‌లో సంక్రాంతి వేడుకలు
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని మానవతా సదన్‌లో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు శ్యాంసుందర్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా సదన్ పిల్లలతో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని అన్నారు. పిల్లలకు పతంగులు, మిఠాయిలను రోటరీ సీనియర్ సభ్యుడు గోపాల్ సోనీ ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి గోవింద్ జవహార్, సభ్యులు ఆకుల అశోక్, రాజ్ కుమార్ సుబేదార్, గోపాల్ సోనీ, శ్రీనివాసరావు, సతీశ్ షాహ, విజయరావు, మురళి, బాబురావు, సదన్ కేర్ టేకర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మానవతా సదన్‌లో శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సదన్ పిల్లలకు పిండి, తీపి పదార్థాలు, అరటి పండ్లను పంపిణీ చేశారు. అలాగే ఆడ పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలు డప్పు వాయిద్యాలు మోగిస్తూ, కోలాటాలు ఆడుతూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సదన్ పిల్లలకు పండుగ ఆనందాన్ని పంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
మానవతా సదన్‌లో సంక్రాంతి వేడుకలు


