భవిత సెంటర్లను అందుబాటులోకి తేవాలి
● నిర్మాణాలు, మరమ్మతులను
వేగంగా పూర్తి చేయాలి
● అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, పాల్గొన్న అధికారులు
నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్ధేశించిన భవిత సెంటర్‌ల నిర్మాణ పనులు, మరమ్మతులను వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని మొత్తం 29 కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాల న్నారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంఈవోలతో కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవా రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, భవిత కేంద్రాలు, కస్తుర్బాగాంధీ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 29 కేంద్రాలకు గాను నూతనంగా చేపట్టిన నిర్మాణాలతోపాటు పాత భవనాల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థుల వివరాల ను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు బాధ్యతాయుతంగా విధు లు నిర్వర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కా ర్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించాలన్నారు. భవిత కేంద్రాలతో పాటు కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గ హాలు, పాఠశాలలు, వైద్యరోగ్య కేంద్రాలు తదితర వాటిని క్రమం తప్పకుండా సందర్శిస్తూ పనితీరును పరిశీలించాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.
భవిత సెంటర్లను అందుబాటులోకి తేవాలి


