పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
సిరికొండ: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ మాలావత్ చందర్‌నాయక్ తెలిపారు. సర్పల్లి తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్తులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. చెత్తా చెదా రాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త ట్రాక్టర్‌లో వేయాలన్నారు. మురుగు నీరు నిలు వ ఉండకుండా, దోమలు వ్యాపించకుండా తగి న చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామా భివృద్ధికి ప్రజలు తగిన సహకారం అందించాలని కోరారు. ఉపసర్పంచ్ పిట్ల కళ్యాణ్, పంచాయతీ కార్యదర్శి రాజు, కారొబార్ శ్రీనివాస్, వైద్య శాఖ సిబ్బంది సుసన్న, విజయ, స్వప్న, ఆశ కార్యకర్త సుజాత తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన కురుమ బీరయ్యకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును బీజేపీ నాయకులు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, నాయకులు కర్క గంగారెడ్డి, నరేశ్ గౌడ్, సదానంద్, మంద నర్సయ్య, రాజశేఖర్, మంద శ్రీకాంత్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా పార్టీ నాయకురాలు అనసూయ రెండో వర్ధంతిని మంగళవారం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. జీవితాంతం పార్టీనీ కుటుంబంగా భావించి, పార్టీ పద్ధ తిలోనే జీవించారని కొనియాడారు. పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్, నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, డీ రాజేశ్వర్, ఏ రవీందర్, వీ గోదావరి, కే సంధ్యారాణి, కే భాస్కరస్వామి, రాధ, మేఘన, వర్ష, కే గణేశ్, డీ నవీన్, ఎం సాయిబాబా, సాయారెడ్డి, సునంద, నర్సక్క, నితిన్, లలిత పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: హిందువులపై వివక్ష చూపకుడదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేశ్ ఠాకుర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశాల్లో పరిషత్ పెద్దలు చేసిన తీర్మానాలను ఇందూర్ శాఖ పూర్తిగా మద్దతు తెలుపుతుందని అన్నారు. ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, గాజులదయానంద్, దాత్రిక రమేశ్, రెబ్బ ఆనంద్, నాంపల్లి శేఖర్, రాంప్రసాద్ చటర్జీ, బాసొల్లా నీకేశ్, ఘన్ శ్యాం, గణేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాయన్న పోరాట స్ఫూర్తితో రైతు ఉద్యమాలు
డిచ్‌పల్లి(మోపాల్)/ నిజామాబాద్ రూరల్: రైతాంగ పోరాట యోధుడు శావులం సాయన్న పోరాట స్ఫూర్తితో రైతు ఉద్యమాలను నిర్వహిస్తామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య అన్నారు. మంగళవారం మోపాల్ మండల కేంద్రంలో సాయన్న వర్ధంతి నిర్వహించారు. వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. 1996న ఆనాటి పీపుల్స్ వార్ అరాచక శక్తులు చేసిన దాడిలో సాయన్న అమరుడయ్యాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గు ఎర్రన్న, సహాయ కార్యదర్శి చిన్నయ్య, న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి బండమీద నర్సయ్య, రమేశ్, సాయిలు, భుజేందర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం రైతాంగ పోరాట నాయకుడు శావులం సాయన్న వర్ధంతి సభను నగర కార్యదర్శి నీలం సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. సభలో నాయకులు ఎం శివకుమార్, జీ రమేశ్, తంపె రాజు, మోహన్, గోపాల్ మల్లికార్జున్, రైస్, వకీల్, శంకర్, అన్వర్, రాజు, సంజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి


