వాహనం ఢీకొని నీల్ గాయ్ మృతి
నిజామాబాద్ అర్బన్: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో నీల్ గాయ్(బ్లూ కౌ) మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జానకంపేట్ శివారులోని గుట్ట ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ బ్లూ కౌను గుర్తు తెలియని వాహనం ఢీ కొన్నది. దీంతో తీవ్ర గాయాలపాలైన నీల్ గాయ్ పంట పొలాల్లో పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు పంట పొలాల్లో నుంచి మృతిచెందింది నీల్‌గాయ్(బ్లూ కౌ) అని గుర్తించారు. ఓ వింత జంతువు మృతి చెందిందని సమాచారం అందడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలివచ్చారు.


