భీమ్‌గల్‌లో 14,045..
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉన్నారు. కమిషనర్ గోపు గంగాధర్ తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఇదివరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం ఓటర్లు 14,189 ఉండగా.. రాజకీయ పార్టీల నాయకులు ఫిర్యాదుల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇతర గ్రామాలకు చెందిన 144 మంది ఓటర్లను గుర్తించి తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. తుది జాబితా ప్రకారం 14,045 ఓటర్లు ఉండగా.. ఇందులో 6,616 మంది పురుషులు, 7,429 మంది మహిళలు ఉ న్నారు. పట్టణ ఓటర్లు తమ ఓట్ల సమాచారం ఆయా కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులపై ప్రచురించిన జాబితాను పరిశీలించి తెలుసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.
పురుషులు 6,616.. మహిళలు 7,429


